విజయ్ సేతుపతి తనయుడు సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఫీనిక్స్’. స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యాక్షన్‌తో పాటు హై ఎమోషన్స్‌తో ఉండబోతుంది. ఏకే బ్రేవ్‌మ్యాన్ పిక్చర్స్ బ్యానర్ పై రాజలక్ష్మి ‘అన్ల్’ అరసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్ర టీజర్‌ని లాంచ్ చేశారు.
హీరో సూర్య సేతుపతి మాట్లాడుతూ, ‘ఈ సినిమాని తెలుగులోకి తీసుకొస్తున్న ధనుంజయన్‌కి థ్యాంక్స్. అనల్ అరసు ఈ సినిమా కోసం నన్ను ఎంపిక చేశారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని భావిస్తున్నాను. ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు అద్భుతమైన ఎమోషన్ ఉంది. త్వరలోనే సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తుంది’ అని తెలిపారు.
‘ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. సూర్య చాలా హార్డ్ వర్కర్. తనకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఈ సినిమా అందర్నీ తప్పకుండా మెప్పిస్తుంది’ అని డైరెక్టర్ అనల్ అరసు చెప్పారు.
ప్రొడ్యూసర్ ధనంజయన్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా చూశాను. చాలా పెద్ద ఫిలిం లాగా అనిపించింది. ఒక డెబ్యు యాక్టర్‌తో ఇలాంటి బిగ్ స్కేల్ సినిమా చేయడం చాలా అరుదు. తప్పకుండా ఈ సినిమా తెలుగు ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుంది’ అని తెలిపారు.
యాక్షన్, ఎమోషన్‌తో ‘ఫీనిక్స్’
- Advertisement -
- Advertisement -