Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంజార్ఖండ్‌లో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

జార్ఖండ్‌లో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

- Advertisement -


– వందే భారత్‌ సహా పలు రైళ్లు రద్దు
చండిల్‌:
దేశంలో రైలు ప్రమాదాలు జరుగుతున్నా..కేంద్రరైల్వేశాఖ ఆశించినమేర కదలటంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జార్ఖండ్‌లోని సెరైకేలా-ఖర్సవాన్‌ జిల్లాలోని చండిల్‌ సమీపంలో శనివారం తెల్లవారుజామున ఒక గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్‌ రైలులోని 20కిపైగా బోగీలు పట్టాలు తప్పినట్టు సమాచారం. దాంతో ఆగేయ రైల్వేలోని చండిల్‌-టాటానగర్‌ సెక్షన్‌ మధ్య రైలు సేవలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఒక అధికారి తెలిపారు. సమాచారం ప్రకారం, ఐరన్‌ లోడ్‌తో వెళ్తున్న గూడ్స్‌ రైలు టాటానగర్‌ నుంచి పురులియాకు వెళుతోంది. చండిల్‌ స్టేషన్‌ దాటిన తర్వాత గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. రైలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై వచ్చాయి. దీంతో ఆ మార్గం గుండా వెళ్లాల్సిన వందేభారత్‌ తో సహా పలు రైళ్లు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img