– శిథిలాలు మురికివాడలపై పడటంతో ఘోరప్రమాదం
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు 100 అడుగుల పొడవు ఉన్న గోడ ఒక్కసారి కూలిపోయింది. ఆ శిథిలాలన్నీ అక్కడే ఉన్న మురికివాడలపై పడ్డాయి. దీంతో ఎనిమిది మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జైత్‌పుర్‌లోని హరినగర్‌లో ఆ ఘటన జరిగింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఓ ఇంటి గోడ కూలింది. ఘటనాస్థలిలో ఒక పాత ఆలయం ఉంది. ఆ పక్కనే అనేక మంది గుడిసెల్లో నివసిస్తున్నారు. శుక్రవారం రాత్రి కురిసన భారీ వర్షాలకు అకస్మాత్తుగా గోడ కూలింది. దీంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ఎనిమిది మంది చనిపోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నట్లు సమా చారం. మృతులను షబీబుల్ (30), రబీబుల్ (30), అలీ (45), రుబీనా (25), డాలీ (25), రుఖ్సానా (6), హసీనా (7)గా అధికా రులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తు న్నామని తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూలిపోయే స్థితిలో ఉన్న నివాసాలలో ఉండొద్దని అధికారులు వెల్లడించారు. విపత్తులో అలాంటి సంఘటన జరగకుండా ఉండటానికి ప్రజలను తరలించామని అడిషనల్ డీసీపీ సౌత్ ఈస్ట్ ఐశ్వర్య వర్మ తెలిపారు.
గోడ కూలినట్టు సమాచారం అందగానే.. పోలీసులు అక్కడికి చేరు కున్నారని చెప్పారు. గాయ పడిన వారిని హుటాహుటిన ఆస్పత్రి తర లించామని పేర్కొ న్నారు. వారిలో కొం దరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.