Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఆపరేషన్‌ సిందూర్‌ ఎందుకు ఆగిపోయింది?

ఆపరేషన్‌ సిందూర్‌ ఎందుకు ఆగిపోయింది?

- Advertisement -

– ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ప్రకటన తరువాత మోడీకి కాంగ్రెస్‌ ప్రశ్న
న్యూఢిల్లీ : మే 10న ఆపరేషన్‌ సిందూర్‌ను ఎందుకు ఆపారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కాంగ్రెస్‌ శనివారం సూటిగా ప్రశ్నించింది. ఈ ఆపరేషన్‌లో ఆరు పాకిస్తాన్‌ యుద్ధవిమానాలను కూల్చివేశామని ఎవరి ఒత్తిడితో భారత వైమానిక దళం ప్రకటించిందని కాంగ్రెస్‌ నిలదీసింది. శనివారం ముందుగా బెంగళూరులో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ ఆపరేషన్‌ సిందూర్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఐదు ఫైటర్‌ జెట్లను, ఒక భారీ యుద్ధవిమానాన్ని కూల్చివేశామని ప్రకటించారు. ఉపరితలం నుంచి గగనతల దాడుల్లో ఇప్పటి వరకూ భారత్‌ నమోదు చేసిన అతిపెద్ద విజయంగా దీన్ని వర్ణించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ సోషల్‌ మీడియాలో స్పందించారు. ‘ఈ రోజు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ చేసిన నూతన ప్రకటనతో మే 10న సాయంత్రం ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రధాని మోడీ ఆకస్మాత్తుగా ఎందుకు ఆపారో అనే విషయం మరింత దిగ్భ్రాంతికరంగా ఉంది’ అని జైరాం రమేష్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ప్రధానిపై ఒత్తిడి ఎక్కడి నుంచి వచ్చింది. ఆయన ఎందుకు అంత త్వరగా లొంగిపోయారు?’ అని ప్రశ్నించారు.
బెంగళూరులో శనివారం నిర్వహించిన 16వ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎల్‌ఎం కాత్రే సార్మక ఉపన్యాసంలో అమర్‌ ప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ ఆపరేషన్‌ సిందూర్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఐదు ఫైటర్‌ జెట్లను, ఒక భారీ యుద్ధవిమానాన్ని కూల్చివేశామని ప్రకటించారు. రష్యా తయారీ ఎస్‌-400ను గేమ్‌ ఛేంజర్‌గా పేర్కొన్నారు. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థను పాకిస్తాన్‌ చేధించలేకపోయిందని చెప్పారు. మన వాయు రక్షణ వ్యవస్థలు అద్బుతంగా పని చేశాయని తెలిపారు. పాకిస్తాన్‌లోని జాకోబాబాద్‌, భోలారిల్లో స్థావరాలపై దాడి చేశామని, కొన్ని ఎఫ్‌-16 విమానాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. భారత దళాలు చాలా నష్టం కలిగించాయని, దీంతో వివాదం కొనసాగితే మరిన్ని నష్టాలను చవిచూస్తామని పాకిస్తాన్‌ గ్రహించిందని అన్నారు. దీంతోనే కాల్పుల విరమణను పాక్‌ కోరిందని తెలిపారు. అంతేకాకుండా దాడులను ప్లాన్‌ చేయడానికి, అమలుచేయడానికి భారత దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినందుకు రాజీయ నాయకత్వానికి అమర్‌ ప్రీత్‌ సింగ్‌ కితాబు కూడా ఇచ్చారు. ‘భారత దళాల విజయానికి కీలక కారణం రాజకీయ సంకల్పం. వారు మాకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మాకు ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఏవైనా ఆంక్షలు ఉంటే అవి మాకు మేం విధించుకున్నవి. ప్రణాళికకు, అమలు చేయడానికి మాకు పూర్తి స్వేచ్ఛ ఉంది’ అని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ తెలిపారు. అలాగే ఉగ్రవాద స్థావరాలపై దాడికి ముందు, దాడి తరువాత ఉపగ్రహ చిత్రాలను కూడా ఆయన పంచుకున్నారు.
5 పాక్‌ యుద్ధ విమానాలను కూల్చాం : ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌
న్యూఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా … పాక్‌కు చెందిన 5 యుద్ధ విమానాలను కూల్చినట్లు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ వెల్లడించారు. పక్కా ప్రణాళికతో ఆపరేషన్‌ సిందూర్‌ నిర్వహించామని అన్నారు. ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థ, డ్రోన్‌ వ్యవస్థలు బాగా పనిచేశాయని చెప్పారు. పాకిస్థాన్‌కు చెందిన ఓ పెద్ద విమానాన్ని కూడా కూల్చినట్లు తెలిపారు. పాకిస్థాన్‌తో పాటు పీవోకేలోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసినట్లు అమర్‌ ప్రీత్‌ సింగ్‌ వివరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img