నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో బిసి రిజర్వేషన్ల ప్రధాత, మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి వర్యులు, న్యాయ కోవిధులు, జెస్టిస్ పుంజాల శివ శంకర్ సార్ గారి 96వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముధోల్ లో ని గాంధీచౌక్ లో శివ శంకర్ సార్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.వారు చేసిన బిసి రిజర్వేషన్ల సాధనకై పోరాడి సాధించిన విజయాన్ని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముధోల్ నియోజకవర్గం మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు రోళ్ళ రమేశ్ , డైరెక్టర్ ధర్మపురి సుదర్శన్, బిసి సంఘం అధ్యక్షులు విఠల్ , ఉపాద్యాక్షుడు పల్లె నాగేష్, మాజీ సర్పంచ్అనిల్, నాయకులు కోరి పోతన్న, గడ్డం సుభాష్, తాటివార్ రమేష్, లవన్ భాస్కర్, శంకర్, శ్రీనివాస్ గౌడ్, యాదవ్ , సాయిలు, ప్రసాద్, నర్సయ్య, లక్ష్మణ్, పోతన్న, గంగాధర్ ,భూమన్న, రాజు, రాకేష్ , గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ముధోల్ లో ఘనంగా శివశంకర్ జయంతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES