Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గొర్రెల బాధితుడికి ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలి..

గొర్రెల బాధితుడికి ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలి..

- Advertisement -

యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు

మంథని మండలంలోని ఖాన్ సాయిపేటలో ఇటీవల పిడుగుపాటుతో మృతి చెందిన 15 గొర్రెలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధి కోసం గొర్ల కాపరి అయిన ఎల్లన్న యాదవ్ మంచిర్యాల జిల్లా బోత్ మండలం నుంచి మేత కోసం మంథని మండలం ఖాన్ సాయిపేట అడివిలోకి వచ్చి గోర్లను కాసుకుంటున్నాడని, ప్రమాదవశాత్తు ఒక్కసారిగా పిడుగు పడి 15 గొర్రెలు మృతి చెందడంతో దాదాపు రూ.2 లక్షల వరకు నష్టం జరిగిందన్నారు. తీవ్రంగా నష్టపోయిన ఎల్లన్నకు ప్రభుత్వ పరంగా నష్టపరిహారం చెల్లించాలని కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img