మండల వ్యవసాయ అధికారి స్వామి నాయక్
నవతెలంగాణ – పెద్దవంగర
రైతు బీమా కొరకు అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి గుగులోత్ స్వామి నాయక్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 2025 జూన్ 5 వరకు నూతనంగా పట్టా పాస్ బుక్ పొందిన రైతులు, గతంలో రైతు బీమా కొరకు దరఖాస్తు చేసుకోని వారు ఈనెల 12 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు లోపు వయసు గల రైతులు రైతు బీమాకు అర్హులని పేర్కొన్నారు. రైతు బీమా ఫారం నింపి దానితో పాటుగా, నూతనంగా వచ్చిన పట్టా పాస్ పుస్తకం, రైతు ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్, నామిని ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలను జత చేసి రైతులు స్వయంగా వెళ్లి, సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేయాలన్నారు.
మార్పు చేర్పుల కోసం ఇంతకుముందు నమోదు చేసుకున్న రైతులకు సంబంధించి ఏవైనా సవరణలు ఉంటే వారు కూడా ఈనెల 12 లోపు సరి చేసుకోవాలన్నారు. ప్రమాదవశాత్తు నామిని చనిపోయిన, కొత్త నామిని మార్పు కోసం వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతు మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షలు నామిని కి ఇస్తుందని, రైతు బీమాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రైతు బీమా కొరకు దరఖాస్తు చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES