– బిజెపి కోసం ఈసీ ఓట్ల దొంగతనం చేసింది
– ఈసీ చేసిన ఓట్ల దొంగతనం తో ఈరోజు
మోడీ ప్రధాని పీఠంపై కూర్చున్నారు
– డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు
నవతెలంగాణ – కామారెడ్డి
దేశంలో ఈసీ ఓట్ల దొంగతనం ప్రజాస్వామ్యానికి అవమానమని, బిజెపి కోసం ఈసీ ఓట్ల దొంగతనం చేసిందనీ ఆ దొంగ ఓట్లతోనే ఈరోజు మోడీ ప్రధాని పీఠంపై కూర్చున్నారని కామారెడ్డి డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏడవ తారీఖున రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి ఓట్ల దొంగతనం ఎలా జరిగిందో పటిష్టమైన ఆధారాలతో కళ్ళకు కట్టినట్టుగా చూపించారన్నారు.
ఈసీ బీజేపీ రెండు ఒకటే అని నిరూపించారు. మోడీ ప్రధాని పీఠంపై దొడ్డి దారిన కూర్చున్నారనీ, ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ కళ్ళు తెరిచి ఓటరు జాబితాను సరి చేయడంలో నిష్పక్షపాతంగా వ్యవహరించి తప్పులను సరిదిద్ది ప్రజాస్వామ్యానికి క్షమాపణ చెప్పాలన్నారు. ఈసీని ఎవరైనా తమ అనుమానాలను అడిగితే వారిని బెదిరించే ధోరణి మానుకోవాలనీ, బీహార్ ఎన్నికలు బ్యాలెట్ తో నిర్వహించి ఓటరు జాబితాను ప్రక్షాళన చేయాలన్నారు. దీంతో బిజెపి అసలు రంగు బయటపడుతుందనీ, ఇప్పటికైనా తప్పు తెలుసుకొని సరిదిద్దుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా గ్రామాల వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టి తమ పోరాటం కోనసాగిస్తాం అని, అయినా ఇలాగే కొనసాగితే ఎన్నికలు బహిష్కరించే రోజులు కూడా వస్తాయి అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పండ్లరాజు, గోనె శ్రీనివాస్ , గుడుగుల, శ్రీనివాస్, పాత శివ కృష్ణమూర్తి, రాజా గౌడ్, ఐరేని సందీప్, పంపరీ లక్ష్మణ్, లక్ష్మీరాజ్యం, మసూద్, రాంకుమార్ గౌడ్, సర్వర్, జమీల్, సిద్దిక్ , సిరాజ్, భాస్కర్, దోమకొండ శ్రీనివాస్, లక్క పతిని గంగాధర్, కిరణ్, కస్తూరి నరహరి తదితరులు పాల్గొన్నారు.
దేశంలో ఈసీ ఓట్ల దొంగతనం ప్రజాస్వామ్యానికి అవమానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES