ఈనెల 13 వరకు అవకాశం..
సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు..
నవతెలంగాణ నాగిరెడ్డిపేట్
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమలు చేస్తోంది ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు బాసటగా నిలుస్తుంది. రూ .5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తుంది. బీమా పథకానికి సంబంధించిన ప్రీమియం డబ్బులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది.
నాగిరెడ్డిపేట మండలంలో..
నాగిరెడ్డిపేట మండలంలో 2024 సంవత్సరానికి సంబంధించి మండల వ్యాప్తంగా 8920 మంది రైతు బీమాకు అర్హులుగా గుర్తించారు. మండల వ్యాప్తంగా ఇప్పటివరకు భీమా కోసం నమోదు చేసుకున్న రైతులకు వ్యవసాయ అధికారులు రెన్యువల్ చేయనున్నారు. పథకం అమలులో భాగంగా పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉన్న అర్హత కలిగి ప్రతి ఒక్క రైతుకు అమలు అయ్యే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.,
కొత్తగా 541 మంది…
2025_ 26 సంవత్సరం కుగాను నాగిరెడ్డిపేట మండలంలో కొత్తగా 541 మందిని అర్హులుగా గుర్తించినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి సాయికిరణ్ తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న రైతు నామిని పేర్లు మార్పు చేసుకునే అవకాశం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
అర్హులు..
రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 5వ తేదీ నాటికి పట్టాదారుగా నమోదయి 18 నుంచి 59 సంవత్సరాలు లోపు వయస్సు కలిగి ఉండాలి. రైతు నామిని ఆధార్ కార్డు, పట్టాదారు పుస్తకం, జిరాక్స్ పత్రాలతో పాటు దరఖాస్తు ఫామ్ నేరుగా రైతు వేదిక క్లస్టర్లలో సమర్పించాల్సి ఉంటుంది. అయితే బీమా పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఉంది రైతుల దరఖాస్తుల స్వీకరణ బట్టి మరి కొన్ని రోజులు గడువు ఇస్తారా లేదా అన్నది తెలియజేయాల్సి ఉంది.
ఏ ఈ ఓ లను సంప్రదించాలి: ఏవో సాయికిరణ్ మండల వ్యవసాయ అధికారి..
రైతు బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలి. కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారు దరఖాస్తులు చేసుకోవాలి. ప్రతి రైతు నేరుగా ఏఈఓ లను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈనెల 13వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది.