Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి: ఎమ్మెల్యే తోట

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి: ఎమ్మెల్యే తోట

- Advertisement -

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
విద్యార్థులకు నాణ్యమైన విద్యను, భోజనాన్ని అందించాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలను నాటి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు పాఠశాలలో సమస్యలను, మౌలిక సదుపాయాల గురించి ప్రిన్సిపల్, సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను, భోజనాన్ని అందించాలని విద్యార్థుల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తుగా ప్రజా ప్రభుత్వం భావిస్తుంది.

కావున దీనిలో భాగంగా విద్యార్థులపై ఖర్చు పెట్టే ప్రతి పైసా రేపటి బంగారు తెలంగాణకు పెట్టుబడి లాంటిదని సీఎం అన్న మాటలను ఆయన సందర్భంగా గుర్తు చేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యకు రాష్ట్ర బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించడం జరిగిందని విద్యావ్యవస్థలో మార్పుకు శ్రీకారం చుట్టాలని ఉద్దేశంతో విద్యా కమిషన్ ఏర్పాటు, అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూల్ గా మార్చడం, గురుకుల విద్యార్థులకు మెస్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలు 200 శాతం పెంచడం జరిగిందని ఆయన తెలిపారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో మెగా డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో 11,000 ఉపాధ్యాయ పోస్ట్లను భర్తీ చేయడం జరిగిందని, పారదర్శకంగా టీచర్స్ బదిలీలను కూడా నిర్వహించి విద్యావ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగిందని ఆయన తెలిపారు. గతంలో  చాలి చాలని బడ్జెట్ తో విద్యార్థులకు సరైన భోజనం అందించలేదని, అరటి పండు ఇస్తే గుడ్డు ఇవ్వలేదు, గుడ్డు ఇస్తే పాలు ఇవ్వలేదని ఇలా ఏదో ఒక రకంగా మెనూలో కోత విధించే వారిని ఆయన అన్నారు. ఇవన్నీ గమనించిన ముఖ్యమంత్రి చదువుతున్న విద్యార్థులకు ఆకలి సమస్య చదువుకు నష్టం కాకూడదు అని మేస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచడం జరిగిందని ఆయన అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img