Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నూలి పురుగు రహిత సమాజానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి: కలెక్టర్

నూలి పురుగు రహిత సమాజానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
నులుగు పురుగు రహిత సమాజానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని యాదాద్రి  భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం  భువనగిరి మండలం బొల్లెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని రాయగిరి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో  జిల్లా కలెక్టర్ హనుమంతరావు  జాతీయ పురుగుల నిర్ములన దినోత్సవం సందర్భంగా స్కూల్ లోని  6 నుంచి 15 సంవత్సరాలలోపు పిల్లలకు నులిపురుగులు మాత్రం ఆల్బెండజోల్ పంపిణీ చేసి, మాట్లాడారు.  పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మన ఆరోగ్యం మన చేతులలో మరియు చేతులను చేతుల్లో ఉంటుందని హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ ను అందరూ అలవాటుగా మార్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్ ,ప్రోగ్రాం అధికారి డాక్టర్ రామకృష్ణ ,బొల్లెపల్లి వైద్యాధికారి డాక్టర్ యామిని శృతి ,పల్లె దవఖాన డాక్టర్ మురళి లు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img