నవతెలంగాణ – పరకాల
2 నుండి 19 సంవత్సరాల లోపు బాలబాలికలు తప్పని సరిగా నులి పురుగుల మందులు వేసుకోవాలని పరకాల ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు అన్నారు. సోమవారం జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పరకాల, నడికూడ మండలం వైద్యాధికారి డాక్టర్ దివ్య ఆధ్వర్యంలో పరకాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో విద్యార్థులకు ట్యాబ్లెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యంపీడీఓ పెద్ది ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్ట్11 వ తేదీన జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం జరుపుతుందని ఈరోజు తప్పనిసరిగా పిల్లలు ఒక ఆల్బండాజోలు మాత్ర వేసుకోవాలని ఈ రోజు ఎవరైనా హాజరు కాకుంటే మాప్ అప్ డే రోజు 18.08.25 తప్పని సరిగా వేసుకోవాలన్నారు..ఈ కార్యక్రమం లో ఎం.ఎల్.హెచ్ పి డాక్టర్ మాధవి, వైద్యసిబ్బంది రాజకుమార్ ఆరోగ్య విస్తరణ అధికారిహెల్త్ సూపర్ వైసర్ , హెల్త్ అసిస్టెంట్ లు, ఏ.యన్.యం. లు, ఆశాలు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రెండు నుండి 19 ఏండ్ల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయాలి: ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES