Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేయాలి..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేయాలి..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పనిసరిగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని బిసి ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరు చంద్రయ్య అన్నారు. సోమవారం జన్నారంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం  రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్  రాష్ట్రపతికి పంపించినప్పటికీ ఎలాంటి స్పందన లేదన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అందుకు సహకరించడం లేదన్నారు.

కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్లు  బీసీలలో ఉన్న ముస్లింలను 10 శాతం రిజర్వేషన్ తీసివేస్తే  42 శాతం  రిజర్వేషన్ కి మేము సహకరిస్తామని అనడం విడ్డూరమన్నారు. ఇది బీసీ ప్రజలను మోసం చేయడమే అన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే తప్పనిసరిగా 42 శాతం కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు లేకుంటే బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీఐఎఫ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ శ్రీరాముల కొండయ్య, మంచిర్యాల డివిజన్ మోకు దెబ్బ అధ్యక్షుడు ఒల్లాల నరస గౌడ్, నిర్మల్ జిల్లా బీ సీ కే ఎస్ కన్వీనర్ కోడి జుట్టు రాజయ్య, బీ సీ కే యూ పీ ఎస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో కన్వీనర్ మామిడి విజయ్, కూడల శ్రీధర్, మహేంద్ర సంఘం నాయకుడు సంద గోపాల్, పూసల సంఘం జన్నారం మండల మాజీ అధ్యక్షుడు గుడ్ల రాజన్న, జన్నారం మండల తాపీ మేస్త్రీల సంఘం అధ్యక్షుడు ముల్కల్ల ప్రభాకర్, ఆర్ టి సి యూనియన్ సీనియర్ నాయకుడు ఎ లచ్చన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img