నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
సమస్యలపై వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి 78 వినతులను స్వీకరించారు. ప్రజలు వారి సమస్యలను విన్నవిస్తు ఇచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ… ప్రజలు నమ్మకంతో ఇచ్చే అర్జీలను పరిష్కరించేల చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న వాటి వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామల దేవి, శిక్షణ కలెక్టర్ సలోని చాబ్ర, ఆర్డీఓ స్రవంతి, ఆయా శాఖల అధికారులున్నారు.
అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES