నవతెలంగాణ – ముంబయి: హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) లాండ్రీ కేర్ విభాగంలో ఒక అద్భుతమైన మరియు వినూత్నమైన ఆవిష్కరణ అయినటువంటి సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ ఎక్స్‌ప్రెస్ ను ప్రారంభించినట్లు ప్రకటించింది. లాండ్రీ డిటర్జెంట్ ఫార్ములేషన్‌లో దశాబ్దాల నైపుణ్యానికి రోబోటిక్స్ మరియు AI తో కలగలిపి, వినియోగదారుల నూతన అవసరాలను తీర్చడానికి ఒక సరికొత్త లాండ్రీ డిటెర్జెంట్ ను ఆవిష్కరించింది. పనితీరులో మా వాగ్దాన్నానికి ప్రాణం పోసేందుకు అనుగుణంగా సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ ఎక్ష్ప్రెస్, భారతీయ పేస్ ఐకాన్ జస్ప్రీత్ బుమ్రాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ ఎక్ష్ప్రెస్ యొక్క ప్రధాన వాగ్దానమైన వేగం మరియు పనితీరుని; వేగం, ఖచ్చితత్వం మరియు స్థిరత్వానికి ప్రసిద్ధి చెందింది జస్పీత్ బుమ్రా సంపూర్ణంగా ప్రతిబింబిస్తారు.
“ఎక్స్‌పర్ట్ క్లీన్, ఇప్పుడు ఎక్స్‌ప్రెస్” అనేది టీవీ మరియు డిజిటల్ ప్రచారాలలో క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది హై-స్పీడ్, హై-పెర్ఫార్మెన్స్ క్లీనింగ్ గురించి బ్రాండ్ యొక్క నిబద్ధతను బలోపేతం చేస్తుంది. ఈ సరికొత్త ప్రాడక్టు అతి తక్కువ వ్యవదైన పదిహేను నిమిషాల సైకిల్స్ కోసం రూపొందించబడినా సుధీర్గ వాషింగ్ సైకిల్స్ కు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇందులో రెండు వేరియంట్‌లు ఉంటాయి – 2X ఫ్రెష్‌నెస్ యాక్షన్‌తో ఎక్స్‌ప్రెస్ క్లీన్ కోసం బ్లూ వేరియంట్ మరియు 2X కేర్ యాక్షన్‌తో ఎక్స్‌ప్రెస్ క్లీన్ కోసం పింక్ వేరియంట్.
సరికొత్త బ్రాండ్ క్యాంపెయిన్ లో, బుమ్రా “ఎక్స్‌పర్ట్ క్లీన్, ఇప్పుడు ఎక్స్‌ప్రెస్” అనే ప్రధాన వాగ్దానాన్ని సజీవంగా తీసుకువస్తున్నారు, ఇది డిటర్జెంట్ యొక్క అద్భుతమైన లక్షణాలైన వేగం, ఖచ్చితత్వం మరియు ప్రతియోక్కసారి నమ్మదగిన ఫలితాలుఅనే విషయాన్ని ప్రధానాంశంగా రూపొందించారు. ఈ ఫిల్మ్ భారతీయ పట్టణ జీవితంలోని ఈనాటి వేగమైన మార్పులు, ఆ వేగానికి తగ్గ డిటర్జెంట్‌గా సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ ఎక్స్‌ప్రెస్‌ను పరిచయం చేస్తుంది.
ఈ సందర్భంగా హోమ్ కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ నందన్ సుందరం గారు మాట్లాడుతూ, “రోజువారీ మరకలకు షార్ట్ సైకిల్స్ పట్ల ప్రజల ఉత్సాహాన్ని చూసిన తర్వాత, లాండ్రీలో సరి కొత్త షార్ట్ సైకిల్ ఉత్పత్తులను ఆవిష్కరించదలచాము. అతి తక్కువ సమయంలో చేయబడే అతి కష్టమైన వాషింగ్ పరిస్థితులలో కూడా అత్యుత్తమ పనితీరును అందించడంలో ఉన్న అన్ని సాంకేతిక సవాళ్ళను అధిగమించాము. ఇది ఒక అద్భుతమైన లాండ్రీ అనుభవాన్ని అందించడం గురించి మాత్రమే కాకుండా, తక్కువ శక్తితో షార్ట్ సైకిల్స్ వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడం గురించి కూడా అవుతుంది. వేగంగా పని చేసి శుభ్రపరిచే ఈ పురోగతి భారతదేశంలోని వినియోగదారులకు మెరుగైన ఆవిష్కరణలను అందజేసే HUL యొక్క పవర్ బ్రాండ్లలో ఒకటైన సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ ఎక్స్‌ప్రెస్‌గా వస్తుంది” అని ఆయన అన్నారు.
“ఈ సరికొత్త ఉత్పత్తి వాషింగ్ మెషీన్ తయారీ దారులు మరియు వినియోగదారులు ఇద్దరికీ గేమ్-ఛేంజర్” అని అన్నారు వర్ల్‌పూల్ ఇండియా మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ నకుల్ తివారీ గారు. “నేడు, సౌలభ్యం మరియు సమయం ఆదా చేసే పరిష్కారాల కోసం అందరూ ఎంతో ఎదురు చూస్తున్నారు. పది నిమిషాల్లో కిరాణా సామాగ్రి డెలివరీ అవుతున్నది చూస్తున్నాం, కాబట్టి మీ లాండ్రీని కేవలం నిమిషాల్లో ఎందుకు శుభ్రం చేయకూడదు? సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ ఎక్స్‌ప్రెస్ దానిని సాధ్యం చేస్తోంది, ఆధునిక వాషింగ్ మెషీన్లు మరియు వేగవంతమైన జీవనశైలిని సంపూర్ణంగా పూర్తి చేస్తుంది.” అని అన్నారు ఆయన.
సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ ఎక్స్‌ప్రెస్ సమర్థవంతమైన మరియు సౌకర్యవంతమైన లాండ్రీ పరిష్కారాలకు సినర్జీని వర్ల్‌పూల్ హైలైట్ చేసింది. “వర్ల్‌పూల్‌లో, మా వాషింగ్ మెషీన్లు సాధ్యమైనంత తక్కువ సమయంలో ఉత్తమ శుభ్రపరిచే పనితీరును అందించడానికి రూపొందించబడ్డాయి.” అని శ్రీ తివారి గారు అన్నారు. “మా ఆటోమేటిక్ టాప్ లోడ్ మరియు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ శ్రేణులు ఎక్స్‌ప్రెస్ వాష్ వంటి ప్రోగ్రామ్‌తో అమర్చబడి ఉంటాయి, అదే సమయంలో 100 కఠినమైన మరకలను తొలగిస్తాయి. డిటర్జెంట్ రంగంలో ఇటువంటి కొత్త వినూత్న ఉత్పత్తులతో, యంత్ర తయారీదారులు మరియు వినియోగదారులు ఇద్దరూ దీని నుండి ప్రయోజనం పొందుతారు.” అని ఆయన చెప్పారు.
సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ ఎక్స్‌ప్రెస్ పరీక్షలో, ఉత్పత్తి యొక్క విప్లవాత్మక ప్రో-ఎస్ టెక్నాలజీ ద్వారా, ఇది షార్ట్ సైకిల్ వినియోగదారుల నాలుగు అతిపెద్ద సమస్యలను పరిష్కరిస్తుందని తేలింది: దుర్వాసన తొలగింపు, మరకల తొలగింపు, తాజాదనం మరియు షార్ట్ సైకిల్‌లో ఫాబ్రిక్ సంరక్షణ; ఇవి వినియోగదారులకు అనుకూలమైన పరిష్కారం.
భారతదేశం అంతటా పట్టణ జీవనం వేగం పుంజుకోవడం మరియు వాషింగ్ మెషీన్ల వ్యాప్తి ఎక్కువ కావడంతో, వినియోగదారుల ఇళ్లలో ఈ సాంకేతికత అభివృద్ధి చెందుతోంది. సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ ఎక్స్‌ప్రెస్ బ్రాండ్ యొక్క ప్రత్యేకమైన ప్రో-ఎస్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇందులోని వేగంగా పనిచేసే పదార్థాల మిశ్రమం సైకిల్ ప్రారంభించిన వెంటనే తన పని ప్రారంభించి, రోజువారీ మురికి మరియు దుర్వాసన సమ్మేళనాలను నిమిషాల వ్యవధిలో మరియు అత్యంత సవాలుతో కూడిన వాషింగ్ పరిస్థితులలో పరిష్కరిస్తుంది. 5 పేటెంట్లు పెండింగ్‌లో ఉన్న విస్తృత పరిశోధన తర్వాత అభివృద్ధి చేయబడిన ఈ ఆవిష్కరణ లాండ్రీ ఉత్పత్తులలో ఒక సరి కొత్త వర్గాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉంది.
ఈ సరికొత్త ప్రొడక్ట్ దక్షిణ భారతదేశంలోని జనరల్ ట్రేడ్ మరియు మోడరన్ ట్రేడ్ అవుట్‌లెట్‌లలో లభిస్తుంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఇ-కామర్స్ మరియు క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.