నవతెలంగాణ – కట్టంగూర్
మండలంలో ని గ్రామాలలో అపరిస్కృతంగా ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం తహసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గద్దపాటి సుధాకర్ మాట్లాడారు. భూభారతి పేరుతో గ్రామాలలో రెవెన్యూ సదస్సులు చేపట్టారని సదస్సులలో వందలాది మంది రైతులు తమ సమస్యలను దరఖాస్తు చేశారని వాటిని పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. వందలాదిమంది నూతన రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేశారని, లబ్ధిదారులు నెలల తరబడి నిరీక్షణ చేస్తున్నారని దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి కార్డులు మంజూరు చేయాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో డివైఎఫ్ఐ మండల కార్యదర్శి గంట మల్లేష్ ఉన్నారు.
భూ భారతి సమస్యలు పరిష్కరించాలని వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES