నవతెలంగాణ – సదాశివనగర్
మండలంలోని రైతులు రైతు బీమాకు దరఖా చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి సోమవారం తెలిపారు. 2025 జూన్ 5 వరకు పట్టా పాస్ బుక్కు వచ్చినవారు ఇంతవరకు రైతు బీమా దరఖాస్తు చేసుకొని రైతులు మాత్రమే రైతుబిమాకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. రైతు బీమాకు కావాల్సిన సర్టిఫికెట్స్ ధర దరఖాస్తు ఫారం, రైతు పట్టాదారు పాసుబుక్కు జిరాక్స్ రైతు ఆధార్ కార్డు జిరాక్స్, నామిని ఆధార్ కార్డు జిరాక్స్ ఆగస్టు 14 1966 నుండి ఆగస్టు 14 2007లో మధ్యలో జన్మించిన వారికి ఈ అవకాశం ఉందా అన్నారు.
ఆధార్ కార్డులో 18 సంవత్సరాలు నిండి 59 సంవత్సరాల వరకు ఉన్న రైతులు రైతుబిమాకు దరఖా చేసుకోవాలన్నారు. సదాశిన మండలంలో కొత్తగా వచ్చిన పట్టాదారుల సంఖ్య 571 ఉన్నట్లు తెలిపారు. గతంలో పాసుబుక్ వచ్చి దరఖాస్తు చేసుకొని వారు కూడా ఆగస్టు 13 తారీకు లోపు సంబంధిత వ్యవసాయ విస్ధిర్ణ అధికిరి దగ్గర దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో రైతు బీమా చేసుకున్న రైతులు ఆధార్ కార్డులో నామిని మార్పులో చనిపోయిన వారి మార్పు కోసం సంబంధిత విస్తీర్ణ అధికారిని సంప్రదించాలని తెలిపారు చివరి తేదీ ఆగస్టు 12 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
రైతు బీమాకు దరఖాస్తు చేసుకోండి: ఏఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES