Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఆశా వర్కర్లకు జూలై నెల పారితోషికాలు వెంటనే చెల్లించాలి

ఆశా వర్కర్లకు జూలై నెల పారితోషికాలు వెంటనే చెల్లించాలి

- Advertisement -

ఆశలకు ప్రతి నెల పారితోషికాలు ఇవ్వాలని ప్రభుత్వానికి బాధ్యత లేదా ? 
ఇవ్వకుంటే ఎట్ల బతకాలి?
సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

ఆశా వర్కర్లకు జులై నెల వారితోషకాలు వెంటనే చెల్లించాలని ఆశలకు ప్రతినెల పారితోషకాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ ప్రశ్నించారు. ఆశ వర్కర్లకు జూలై నెల పారితోషికాలు ఇవ్వాలని డిఎం అండ్ హెచ్ ఓ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు జూలై నెల పారితోషికాలు వెంటనే చెల్లించాలి. భవిష్యత్తులో ఈ విధంగా ఆలస్యం జరగకుండా గతంలో చెల్లించినట్లు ప్రతి నెల ముగింపు 30వ తేదీ లోపు పారితోషికాలు చెల్లించాలని జిల్లాలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు నేటికి జూలై నెల పారితోషికాలు రాలేదు.

జూలై నెల పూర్తయి 11రోజులు గడుస్తున్నది. నేటికీ పారితోషికాలు రాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఆశా వర్కర్లకు పారితోషికాలు గతంలో చెల్లించినట్లు సకాలంలో రావడం లేదు. దీంతో ఆశా వర్కర్లు అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. కావున జూలై నెల పారితోషికాలు వెంటనే చెల్లించాలని, భవిష్యత్తులో ఈ విధంగా ఆలస్యం జరగకుండా ప్రతి నెల ముగింపు (30వ తేదీ) లోపు చెల్లించాలని కోరుతున్నాము.జిల్లాలో ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు. పారితోషికం ఉన్నవి, లేనివి అనే సంబంధం లేకుండా ప్రభుత్వం చెప్తున్న ప్రతి ఒక్క పనిని ఆశా వర్కర్లు అమలు చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మొత్తం ఆశాలు పనిలోనే ఉంటున్నారు. ఇంత పని చేస్తున్నా నేటికి కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర ఎలాంటి సౌకర్యాలు ఆశా వర్కర్లకు ప్రభుత్వం కల్పించలేదు. కేవలం రూ.9,900/- లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు చెల్లిస్తున్నది. ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం పారితోషికాలు పెంచి నాలుగు సంవత్సరాలు అవుతుంది.

ఈ కాలంలో అనేక రెట్లు పని భారం పెరిగింది. నిత్యావసర వస్తువుల ధరలు అనేక రెట్లు పెరిగాయి. వీటితో పోల్చినప్పుడు వస్తున్న పారితోషికాలు కుటుంబ అవసరాలకు సరిపోవడం లేదు. ఫిక్స్డ్ వేతనం రూ.18,000/- లు చెల్లించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని అనేక సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఆశా వర్కర్లు అడుగుతున్నారు. ఈ అంశాల పైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించడం లేదు. ఇవి పరిష్కారం కాకపోగా వచ్చే పారితోషికాలు కూడా సకాలంలో రాకపోతే ఎలా బతకాలని జిల్లా వ్యాప్తంగా ఆశ వర్కర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బకాయి పారితోషికాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు లేనియెడల పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు స్థానిక సమస్యలను అధికారుల వేధింపులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రేణుకా, సుకన్య, సిహెచ్ నర్స, రేణుక, అనీఫా, సంగీత, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img