నవతెలంగాణ – కంఠేశ్వర్
టిఎన్జీవో జిల్లా సంఘం ఆధ్వర్యంల జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ అధ్యక్షతన ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్,టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. టీఎన్జీవో బాధ్యులు, అన్ని శాఖల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు శ్రేయోభిలాషులు అందరూ సుమన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీఎన్జీవో జిల్లా సంఘం ఆధ్వర్యంలో సుమన్ కి శాలువ, గజమాలతో ఘనంగా సన్మానించి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు.
టీఎన్జీవో నిజాంబాద్ జిల్లా పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అనంతరం టీఎన్జీవో అన్ని యూనిట్ శాఖల పక్షాన, వివిధ శాఖల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు, ఉద్యోగులు మరియు శ్రేయోభిలాషులు జన్మదిన వేడుకల్లో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా సహాధ్యక్షులు పెద్దోళ్ల నాగరాజు, చిట్టి నారాయణ రెడ్డి, దినేష్ బాబు,అన్ని యూనిట్ శాఖ అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మహిళా ఉద్యోగ సోదరీమణులు అన్ని శాఖల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు, ఉద్యోగులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
ఘనంగా టీఎన్జీవో అధ్యక్షుడి జన్మదిన వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES