Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షా సమావేశం..

సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షా సమావేశం..

- Advertisement -

రైతులకు సకాలంలో నీరు అందేలా చర్యలు వేగవంతం చేయాలి.. 
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
నవతెలంగాణ – వేములవాడ 

వేములవాడ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమీక్షించారు. హైదరాబాద్‌లో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, పలు ఏజెన్సీల ప్రతినిధులతో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వల నిర్మాణ పనులు, మల్కాపేట రిజర్వాయర్ ఎడమ కాలువ భూ సేకరణ, వేములవాడ రూరల్ మండలంలోని మర్రిపల్లి ప్రాజెక్టు పనులు, కోనరావుపేట మండల పరిధిలోని లచ్చాపేట తండా రిజర్వాయర్ కాలువ పనులు, చందుర్తి మండలంలోని ఆశిరెడ్డిపల్లి కొచ్చేరువు, సనుగుల ఎర్ర చెరువు, పటేల్ చెరువుల్లోకి నీరు చేరే ఏర్పాట్లు వంటి అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాజెక్టులను సకాలంలో, నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. రైతులకు సాగునీరు సమయానికి అందేలా అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. మౌలిక వసతుల అభివృద్ధి, పారదర్శకత, వ్యవసాయ ఉత్పాదకత పెంపు ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఈ సుధాకర్ రెడ్డి, ఈఈ సంతు ప్రకాష్ సహా ఇంజినీరింగ్ అధికారులతో పాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img