Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఇందిరా మహిళా శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

ఇందిరా మహిళా శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

- Advertisement -

60 ఏళ్ల పైబడిన వారికి ప్రత్యేక సంఘాలు
జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు.
నవతెలంగాణ – భువనగిరి

వృద్ధ మహిళలు, పిడబ్ల్యుడి దివ్యాంగులు, 15 నుండి 18 సంవత్సరాల లోపు యువతి బాలికలను స్వయం సహాయక సంఘాలలో చేర్చే విధానాన్ని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ఇందిరా మహిళా శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు తెలిపారు. సోమవారం స్థానిక మాస్కుంటలోని రైతు వేదికలో జిల్లా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ మహిళా శక్తి మిషన్ ప్రణాళికలో భాగంగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.  స్వయం సహాయక సంఘాలలో చేరకుండా మిగిలిన అర్హత కలిగిన మహిళలు, వృద్ధ మహిళలు (60 ఏళ్లు పైబడిన వారు), దివ్యాంగులు (పిడబ్ల్యుడి)  15–18 సంవత్సరాల వయస్సు గల యువతీ బాలికలను స్వయం సహాయక సంఘములలో  చేర్చే విధానం, ప్రయోజనాలు, ప్రభుత్వ పథకాల అనుసంధానం గురించి అవగాహన కల్పించారు.

ప్రభుత్వం ప్రకటించిన “ఇందిరా మహిళా శక్తి” విధానంలో భాగంగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసి, మహిళలను ఆర్థికంగా శక్తివంతం చేయడం ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టి. నాగిరెడ్డి మాట్లాడుతూ మిషన్ లక్ష్యాలు, ప్రాధాన్యతను వివరించారు.ఈ శిక్షణా కార్యక్రమంలో అదనపు డి. ఆర్. డి. ఓ శ్రీ కోట జంగా రెడ్డి , జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు  రేణుక, కార్యదర్శి  పల్లవి, కోశాధికారి  అలివేలు, డీపియం లు, ఎపియం లు, సిసి లు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img