నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండల కేంద్రంలోని ఆలూర్, దేగాం గ్రామాలలో 2025–26 విద్యాసంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రీ ప్రైమరీ పాఠశాలలను (ఎల్‌కేజీ, యూకేజీ) ప్రారంభించనున్నట్లు మండల విద్యాధికారి నరేందర్ మంగళవారం తెలిపారు.
ప్రతి పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు, ఒక ఆయాను నియమించనున్నారు. ఉపాధ్యాయ నియామకానికి ఇంటర్మీడియట్ తో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి అని తెలిపారు. ఆయా నియామకానికి కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 15లోపు దరఖాస్తులను మండల విద్యాధికారి కార్యాలయంలో సమర్పించాలి. జిల్లా విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక జాబితా విడుదల చేస్తారని తెలిపారు.