ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ హనుమంతరావు…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకములో ఇటీవల నూతనముగా ప్రవేశపెట్టిన సాంకేతిక విధానములు మొబైల్ అప్ ద్వారా ఆన్ లైన్ లో పొందు పరచుటకు సంభందించిన జియో ఫెన్సింగ్, జియో రిఫరెన్స్, నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా పేస్ అంతేంటికేషన్ అప్ లో హాజరు నమోదు గురించి, ఈ- ఎంబి సెక్యూర్ , యుక్తదార అంశములపై డిఆర్డివో ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హాజరై, మాట్లాడారు. ఉపాధి హామీ మొబైల్ యాప్ నూతన విధానము ల వలన పూర్తీ పారదర్శకత ఉంటదని ఇవి అన్ని క్షేత్ర స్తాయిలో అమలు కావాలని, ఉపాధి హామీ పని వారికి రూ. 307/- వేతనము వచ్చేల పని చేయించాలని మేటేరియాల్ కంపోనేంట్ క్రింద మంజూరి ఇచ్చిన పశువుల పాక, గొర్రెల షెడ్డు, కోళ్ల షెడ్, నాడెప్ కంపోస్ట్ పనులను , చెక్ డ్యామ్ లను త్వరలో పనుల భాగముగా ప్రారంభించుటకు సమాయత్తం కావాలని ఆదేశము జారీ చేశారు.
స్వచ్చ భారత్ మిషన్ లో భాగముగా ప్రతి గ్రామములో 30 ఇంకుడు గుంతలు నిర్మించేలా చర్యలు చేపట్టాలని ఈ విధముగా జిల్లా మొత్తం 12810 పూర్తీ చేయాలని, ఇందిరమ్మ ఇండ్లు పూర్తి అయ్యే విధముగా చర్యలు తీసుకోవాలని ఇంకుడు గుంతలు మంజూరి చేయవలెనని , హర్ ఘర్ తిరంగా – హర్ ఘర్ స్వచ్చతా కార్యక్రమమునకు సంభందించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. వీదులను, ప్రభుత్వ కార్యాలయములు , కమ్యూనిటీ హాల్, గ్రంథాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, క్రీడా మైదానాలు, మార్కెట్లు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు శుబ్ర పరుచవలెను , స్వచ్చతా ప్రతిజ్ఞ నిర్వహించవలెనని అన్నారు. అనంతరం
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) భాస్కర్ రావు మాట్లాడుతూ వనమహోత్సవములో భాగముగా కేటాయించిన లక్ష్యమును పూర్తి చెయ్యాలనీ , అమృత్ సరోవర్ చెరువుల వద్ద ఆగస్టు 15 వ తేదీన జెండా వందన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించినారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి , అదనపు డి ఆర్. డిఓ సురేష్, అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ మందడి ఉపేందర్ రెడ్డి , మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, స్వచ్చ భారత్ మిషన్ కన్సల్టెంట్లు , అధికారులు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు, సాంకేతిక సహాయకులు, కంప్యూటర్ ఆపరేటర్ లు పాల్గొన్నారు.