నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామంలోని ప్రీమియర్ ఎక్సప్లోసివ్ కంపెనీలో ఈ రోజు ఉదయం 7.00 గంటలకు ఈ. ఎం -1 బిల్డింగ్ లో స్టీం వ్యాక్కుం పేలుడు సంబవించడంతో గోదావరిఖని కి చెందిన సదానందం అక్కడికి అక్కడే మృతి చెందాడు. ఆయన కుటుంబం రోడ్డు పాలు అయిందని దీనికి పరిశ్రమ యజమాన్యం ఆయన కుటుంబానికి రూ.2 కోట్ల ఎక్స్గ్రేషియా చెల్లించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం రోజున సదానందం మృతదేహాన్ని భువనగిరి జిల్లా హాస్పిటల్ లో సందర్శించి అతని భార్య అఖిల, అయన కుటుంబ సభ్యులను సిపిఐ జిల్లా నాయకులతో కలిసి దామోదర్ రెడ్డి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమ యజమాన్యం నిర్లక్ష్యం కారణంగా తరచూ ఈ కంపెనీలో ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇన్ని ప్రమాదాలు జరుగుతున్న కూడా సంబంధిత అధికారులు మరియు కార్మిక శాఖ అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనికి సంబంధిత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అగ్నిమాపక శాఖ మరియు పరిశ్రమల శాఖ వారి పర్యవేక్షణ లోపం వల పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగి అమాయక కార్మికుల జీవితాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సదానందం కుటుంబానికి 2 కోట్ల ఎక్స్గ్రేషియా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం తో పాటు దాన సంస్కరణకు 2 లక్షలు ఇవ్వాలని అయన డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ, అయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ యాదగిరిగుట్ట మండల కార్యదర్శి కల్లేపల్లి మహేందర్ లు పాల్గొన్నారు.
మృతుని కుటుంబానికి రూ.2 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES