Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంచైనాపై సుంకాలకు ట్రంప్‌ వెనకడుగు

చైనాపై సుంకాలకు ట్రంప్‌ వెనకడుగు

- Advertisement -

అమెరికా, చైనా ట్రేడ్‌ డీల్‌కు మరింత విరామం
90 రోజులు గడువు పొడిగింపు
వాషింగ్టన్‌ :
భారత్‌పై అధిక టారిఫ్‌లను అమలు చేయడంలో అమెరికా దూకుడుగా వ్యవహారిస్తోన్న వేళ.. మన పొరుగుదేశం చైనాతో మాత్రం తలొగ్గుతోనే ఉంది. తాజాగా చైనాతో వాణిజ్య ఒప్పందానికి మరో 90 రోజుల విరామం ప్రకటిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు. రష్యా చమురు కొనుగోలును కారణంగా చూపి భారత్‌పై ట్రంప్‌ ఇటీవల భారీస్థాయిలో 50 శాతం సుంకాలు విధించారు. అదే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనా విషయంలో మాత్రం ట్రంప్‌ భిన్నవైఖరిని అవలంభించడం విశేషం. యూఎస్‌ తాజా నిర్ణయంతో ఇరు దేశాలు విధించుకున్న అధిక సుంకాల అమలు నిలిచిపోయింది. అధిక సుంకాల అమలును నవంబర్‌ 10వ తేదీ అర్థరాత్రి వరకూ నిలిపివేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశానని ట్రంప్‌ తన సామాజిక ట్రూత్‌ సోషల్‌ మాధ్యమ వేదికలో ప్రకటించారు. అటు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా మంగళవారం ఉదయం సుంకాల విధింపునకు విరామం ప్రకటించింది. వాణిజ్యం, పెట్టుబడుల పరిమితి జాబితాలోకి అమెరికా సంస్థలను చేర్చడాన్ని కూడా 90 రోజులు వాయిదా వేసింది.

చైనా వస్తువులపై అమెరికా 145 శాతం వరకూ సుంకాలు విధించకుండా తాజా కార్యనిర్వాహక ఆదేశాలు నిరోధిస్తాయి. అలాగే అమెరికా వస్తువులపై చైనా కూడా 125 శాతం టారిఫ్‌ విధించదు. ప్రస్తుతం చైనా దిగుమతులపై అమెరికా 30 శాతం, అమెరికా దిగుమతులపై చైనా 10 శాతం సుంకాలు విధిస్తున్నాయి. ‘ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలలో పరస్పర వాణిజ్యం లేకపోవడం, దాని ఫలితంగా తలెత్తే జాతీయ, ఆర్థిక భద్రతా సమస్యలను పరిష్కరించడానికి చైనాతో అమెరికా చర్చలు కొనసాగిస్తుంది’ అని ట్రంప్‌ తన ఉత్తర్వులలో తెలియజేశారు. కాగా చైనా, అమెరికా మధ్య సుంకాలపై గతంలో కుదిరిన ఒప్పందం మంగళవారం మధ్యాహ్నం ముగిసింది. తాజాగా గడువు పొడిగించడంతో క్రిస్మస్‌ సీజన్‌ కోసం దిగుమతులను పెంచుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా తక్కువ సుంకాలతో ఎలక్ట్రానిక్స్‌, దుస్తులు, బొమ్మలు సహా పలు వస్తువులను అమెరికా దిగుమతి చేసుకోవచ్చు.

ఒప్పందపు గడువు పొడిగింపు ద్వారా జూన్‌లో రెండు దేశాల అధినేతల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి అవకాశం లభిస్తుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం చేకూరుతుందని చైనా తెలిపింది. వాణిజ్య ఒప్పందానికి రెండు దేశాలు చేరువ అవుతున్నాయని, ఒప్పందం కుదిరితే ఈ సంవత్సరాంతం లోపు జిన్‌పింగ్‌తో సమాy ేశమవుతానని ట్రంప్‌ గత వారం తెలిపారు. రెండు దేశాలు పరస్పరం విధించుకున్న మూడంకెల దిగుమతి సుంకాలు ఆమోద యోగ్యం కావని, అవి ప్రపంచంలోని రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య నిషేధానికి కారణమయ్యాయని అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్‌ బెస్సెంట్‌ పదే పదే చెబుతూ వచ్చారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img