– సుప్రీం కోర్టు తీర్పు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
న్యాయవాది దంపతులు గట్టు వామనరావు – నాగమణిల హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. హత్య కేసును మరోసారి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయ పడింది. కేసును సమగ్రంగా మళ్లీ దర్యాప్తు చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)ని ఆదేశించింది. పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని కల్వచర్ల వద్ద 2021 ఫిబ్రవరి 17న గట్టు వామనరావు, ఆయన భార్య నాగమణి దారుణ హత్యకు గురయ్యారు. కారులో వెళుతున్న దంపతులను అడ్డగించిన దుండగులు.. నడిరోడ్డుపైనే అత్యంత కిరాతంగా హతమార్చారు. స్థానిక పోలీసులు దర్యాప్తు చేసి, చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. అయితే, తన కుమారుడు, కోడలు హత్యకు సంబంధించి సీబీఐ దర్యాప్తు జరిపించాలని వామనరావు తండ్రి కిషన్ రావు 18-09-2021 న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితులు బెదిరింపులకు పాల్పడుతున్నారని, త్వరగా విచారణ జరిపించి కేసును సీబీఐకి అప్పగించాలని, దోషులకు కఠినంగా శిక్షపడేలా చూడాలని ఆయన పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. అయితే, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని పుట్ట మధుకర్ ప్రమేయంతోనే హత్య జరిగిందని, సీబీఐ విచారణ జరిగితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి సుధీర్ఘకాలంగా వాదనలు వినిపిస్తున్నారు. ఎట్టకేలకు, తెలంగాణలో ప్రభుత్వం మారడంతో విచారణను సీబీఐకి అప్పగించడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
న్యాయవాది గట్టు వామనరావు దంపతుల కేసుసీబీఐ చేతికి
- Advertisement -
- Advertisement -