- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. దీంతో, శ్రీశైలం, నాగార్జునసాగర్ కు భారీగా వద నీరు చేరుతోంది. నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. సాగర్ ప్రాజెక్టులో మొత్తం 26 గేట్లు ఉండగా 24 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇక సాగర్ కు ఇన్ ఫ్లో 1,74,533 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 2,33,041 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 589.30 అడుగులుగా ఉంది. సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 309.95 టీఎంసీలకు చేరుకుంది.
- Advertisement -