- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: జమ్ముకాశ్మీర్‌లోని ఉరి జిల్లాలో నియంత్రణ రేఖ సమీపంలో భారత్, పాక్ దళాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక సైనికుడు మరణించినట్లు ఆర్మీ తెలిపింది. వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం కొందరు పాకిస్తానీ చొరబాటుదారులు భారత్‌లోకి ప్రవేశించడానికి యత్నించారు. ఇది సాధారణ చొరబాటు యత్నానికి భిన్నంగా ఉందని, పాక్ సైన్యం వారికి సహకరించిందని అన్నారు. భారత సైన్యం వారిని అడ్డుకుంటుండగా.. పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక సైనికుడు మరణించాడు. చొరబాటుదారులు పారిపోయినట్లు ఆర్మీ వర్గాలు బుధవారం తెలిపాయి. పహల్గాం దాడికి ప్రతిగా భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్తాన్ చేపట్టిన మొదటి హింసాత్మక చర్య ఇది.
- Advertisement -