పెళ్ళికొడుకుని మోసుకెళ్లిన బంధువులు..
4 గంటల పాటు పెళ్ళికొడుకు నిరీక్షణ
నవతెలంగాణ – గన్నేరువరం
మండల కేంద్రం గన్నేరువరం ఊర చెరువు మత్తడి ప్రవాహం ఎక్కువై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో మండల కేంద్రంలో పెళ్లికి చేరుకోవలసిన పెళ్ళికొడుకు వాహనం వరద ఉదృతి మూలంగా ఉన్నచోటు నుంచి కదల్లేదు. విధి లేని పరిస్థితిలో బంధువులు పెళ్ళికొడుకును భుజాలపై మోసుకుంటూ అవతలి ఒడ్డుకు చేర్చి మరో వాహనంలో తీసుకొని వెళ్లారు. లో లెవెల్ కల్వర్టు సమస్యతో మండల ప్రజలు ప్రతి సంవత్సరం ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు. వరద ఉదృతి పెరిగితే బస్సులు బంద్ అయ్యే పరిస్థితి ఉందని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని మండల ప్రజలు వేడుకుంటున్నారు.
మత్తడి దాటలేక పెళ్ళికొడుకు పాట్లు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES