Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ బడుల్లో వసతులు కల్పించడమే లక్ష్యం...

కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ బడుల్లో వసతులు కల్పించడమే లక్ష్యం…

- Advertisement -

నవతెలంగాణ – మునుగోడు
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో వసతులు కల్పించాలన్నదే వెదిరే పూలమ్మ పౌండేషన్ లక్ష్యం అని ఫౌండేషన్ సభ్యులు వెదిరే విజేందర్ రెడ్డి అన్నారు. గురువారం మునుగోడు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో 206 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని లక్ష్యంతో వెదిరే పూలమ్మ పౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా వాలంటరీను నియమించేందుకు వెళ్లిన సందర్భంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుంకరి భిక్షం గౌడ్ విద్యార్థులకు కరాటే , యోగ  సమయంలో సరైన వసతులు లేక  ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వెంటనే స్పందించిన వెదిరే విజేందర్ రెడ్డి  విద్యార్థులకు అవసరమైన కార్పెట్లను అందిస్తామని హామీ ఇచ్చారు.

యోగ , కరాటే సమయంలో ఉపయోగించుకునేందుకు కార్పెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని గుర్తు చేస్తూ, పట్టుదలతో  చదివి రాబోయే రోజుల్లో ఉద్యోగాలను పొంది  సమాజ సేవలో ముందుకు రావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మునుగోడు మండల తహసీల్దార్ నరేష్ , మండల పరిషత్ అధికారి విజయ్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భిక్షం గౌడ్, సుధాకర్ రెడ్డి, సంకు శంకర్, నాంపల్లి కృష్ణ, గోలి అనిల్ , ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad