Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్టారిఫ్‌ల ప్రభావాన్ని అంచనా వేయలేం

టారిఫ్‌ల ప్రభావాన్ని అంచనా వేయలేం

- Advertisement -

– సీఈఏ అనంత నాగేశ్వరన్‌
ముంబయి :
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ విధించిన అధిక టారిఫ్‌ల ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని కేంద్ర ప్రభుత్వ చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ (సీఈఏ) అనంత నాగేశ్వరన్‌ అన్నారు. ఇప్పటి వరకు భారత ఆర్థిక వ్యవస్థ మందిగిస్తున్న సంకేతాలు ఏమీ కనిపించలేదన్నారు. ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ 6.3 నుంచి 6.8శాతం వృద్ధిని నమోదు చేయొచ్చన్నారు. ముంబయిలో జరిగిన ఒక కార్యక్రమంలో అనంత నాగేశ్వరన్‌ మాట్లాడుతూ.. భారత్‌లో రాజకీయ స్థిరత్వం, భారీ మార్కెట్‌ అవకాశాలు, బలమైన లేబర్‌ మార్కెట్‌, స్థిరమైన ఆర్థిక వృద్ధి కారణంగా తయారీ సంస్థల ఏర్పాటుకు భారత్‌ అత్యుత్తమ ప్రదేశమని పేర్కొన్నారు. సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ రంగాల్లో పోటీపడేందుకు భారత్‌ కీలక చర్యలు చేపడుతోందన్నారు.
ప్రస్తుతం భారత వస్తువులపై అమెరికా 25 శాతం టారిఫ్‌లను విధిస్తోంది. ఇవి ఆగస్ట్‌ 27 నుంచి 50 శాతానికి పెరగనున్నాయి. రష్యా నుంచి చమురు, గ్యాస్‌ దిగుమతుల కారణంగా ఈ అదనంగా 25 శాతం టారిఫ్‌లను విధిస్తున్నట్లు ట్రంప్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ చర్యలను భారత విదేశాంగశాఖ వ్యతిరేకిస్తోంది. భారత్‌ ఎగుమతులకు అతిపెద్ద మార్కెట్లలో అమెరికా కూడా ఒకటి. 2024-25లో భారత్‌ 86.51 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad