టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి
పదో వార్షికోత్సవం, 79వ స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు
నవతెలంగాణ – పెద్దవంగర
పేదల గుండెచప్పుడు నవతెలంగాణ పత్రిక అని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. పత్రిక పదోవ వార్షికోత్సవం, 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలపై, అక్షరాలను ఆయుధంగా మార్చి నవతెలంగాణ పత్రిక ప్రజలకు తెలుపుతోందని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తూ, ప్రజా సంక్షేమానికి ముందు ముఖ్యభూమిక పోషిస్తున్నదని వివరించారు. సామాజిక స్పృహతో ప్రజలవాణిని ప్రపంచానికి వినిపించేలా ఈ పత్రిక పని చేస్తున్నదని తెలిపారు. సామాన్యుడు ఎదుర్కొంటున్న కష్టాలపై అనుదినం జనస్వరం అనే నినాదంతో పురుడు పోసుకున్నదని, ఎన్ని కష్టాలు ఒడిదుడుకులు వచ్చినా తాను ఎంచుకున్న లక్ష్యం కోసం పనిచేస్తుందని ఆమె కొనియాడారు. నవతెలంగాణ దినపత్రిక మేనేజ్మెంట్, విలేకరులకు, సిబ్బంది, ప్రజలకు నవతెలంగాణ 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
పేదల గుండెచప్పుడు.. నవతెలంగాణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES