నవతెలంగాణ-హైదరాబాద్: వీధి కుక్కల అంశానికి సంబంధించిన కేసులో గురువారం తన తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. స్థానిక అధికారులు తమ విధులను బాధ్యతగా నిర్వర్తించడం లేదని, వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి.అంజారియాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే జస్టిస్ జె.బి.పార్థివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పౌర సంస్థలకు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది.
ఢిల్లీ, ఎన్‌సిఆర్ పరిధి నుండి వీధి కుక్కలన్నింటినీ తొలగించాలని ఈ నెల 11న సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ వీధుల్లో ఎక్కడా వీధి కుక్కలు ఉండటానికి వీల్లేదని స్పష్టం చేసింది.