- Advertisement -
మువ్వన్నెల జెండా
ఎగరాలి ఎగరాలి
మువ్వన్నెల జెండా
స్వాతంత్య్ర దినోత్సవాన
ఆకాశం నిండా
మూడు రంగుల జెండా
ముచ్చటైన మన జెండా
ఎగరాలి ఎగరాలి
మన కన్నుల నిండా
త్యాగం శాంతి సస్యం
సంకేతం మన జెండా
ధర్మానికి న్యాయానికి
అశోక చక్రమే అండ
భరతమాత వైభవాన్ని
చాటిచెప్పు మనజెండా
జన్మభూమి ఘన చరితను
చాటెను గుండెల నిండా
లౌకిక భావానికి
ప్రతి రూపమే మన జెండా
ప్రజాస్వామ్య ప్రాభవపు
ప్రతీక జాతీయ జెండా
తెల్లదొరల తరిమికొట్టి
తెగువను చాటిన జెండా
దేశ ప్రగతి సారథియై
నిలిచినదీ మనజెండా
స్వాతంత్య్రం సాధించి
సత్తా చాటిన జెండా
స్వరాజ్యాన్ని పురోగతిన
నిలబెట్టిన మన జెండా
ప్రపంచాన ఘనకీర్తిని
రెపరెపలాడించిన జెండా
మూడు రంగుల జెండా
ముచ్చటైన మనజెండా
- నాగరాజు కామర్సు
92480 93580
- Advertisement -