Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలువెండితెరపై పెంచల్‌ రెడ్డి జీవితం

వెండితెరపై పెంచల్‌ రెడ్డి జీవితం

- Advertisement -

శ్రీ లక్ష్మి ఎడ్యూకేషనల్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌, సంతోష్‌ ఫిలింస్‌ బ్యానర్స్‌ పై పలు బాలల చిత్రాలు రూపొందించి, ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కించుకున్నారు దర్శక, నిర్మాత భీమగాని సుధాకర్‌ గౌడ్‌. ఆయన రచనా, దర్శకత్వంలో తెరకెక్కిన మరో చిత్రం ‘ఆపద్భాంధవుడు’. దీన్ని పెంచల్‌ రెడ్డి. డి.లీలావతి నిర్మించారు. ఈ చిత్రంలో పెంచల్‌ రెడ్డి, సుధాకర్‌ గౌడ్‌, ఝాన్సీ, ప్రతిమ, నాగేశ్వరరావు కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్‌ 5న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

దర్శకుడు భీమగాని సుధాకర్‌ గౌడ్‌ మాట్లాడుతూ,’వ్యాపారం, కుటుంబం, సమాజ సేవ.. ఈ మూడింటిని సమన్వయం చేసుకుంటూ సేవా రత్నగా గుర్తింపు పొందిన గొప్ప వ్యక్తి పెంచల్‌ రెడ్డి. ఈ చిత్రంలో ఆయన నటించడం విశేషం. నేనూ ఆయన మిత్రుడిగా నటించాను. ఇది సజీవ పాత్రలతో సాగే ఫిలిం. దీన్ని బయోపిక్‌లా, లైవ్‌గా, సరికొత్త పద్ధతిలో తెరకెక్కించాం. వయసైన పెద్దవాళ్లు కుటుంబ సభ్యుల నిరాదరణకు గురై వద్ధాశ్రమాల్లో గడుపతున్నారు. వయోధికులు తమ సంపాదనను కేవలం వారసులకే కాకుండా కొంత సమాజ సేవకు ఉపయోగిస్తే ఎంతో ఆత్మసంతప్తి పొందుతారు. అలాంటి ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి పెంచల్‌ రెడ్డి. ఈ చిత్రాన్ని ఎన్నో ఇనిస్టిట్యూషన్స్‌లో ప్రదర్శించాం. వాళ్లందరి దగ్గర నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం ప్రేక్షకుల్లో, సమాజంలో చైతన్యం తీసుకొస్తుంది’ అని తెలిపారు.


‘నా సంపాదనలో 50 శాతం విరాళాల రూపంలో సేవా కార్యక్రమాలకు ఇస్తున్నాను. స్కూల్స్‌, కాలేజెస్‌, టెంపుల్స్‌, సీనియర్‌ సిటిజన్స్‌కి సహాయం చేస్తున్నాను. నా జీవిత కథను సజీవ చిత్ర రూపంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న దర్శకులు భీమగాని సుధాకర్‌ గౌడ్‌కి నా ధన్యవాదాలు ఈ చిత్రం ప్రేక్షకులకు స్ఫూర్తి కలిగించి, సేవా కార్యక్రమాలు చేయాలనే చైతన్యాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నా’ అని సేవా రత్న గ్రహీత పెంచల్‌ రెడ్డి చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad