నవతెలంగాణ – చారకొండ
గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతికగా తీజ్ వేడుకలను మండలంలోని గైరాన్ తండాలో గిరిజనులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన యువతులు తొమ్మిది రోజులపాటు బుట్టల్లో గోధుమ గింజలు పెట్టి మొలకెత్తిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం తీజ్ వేడుకల ముగింపులో భాగంగా తండాలో డప్పు చప్పుళ్ళ మధ్య గిరిజనులు నృత్యాలతో సందడి చేశారు. పెళ్లి కాని యువతులు మొలకెత్తిన బుట్టలను నెత్తిన పెట్టుకొని ఊరేగించారు. అనంతరం సమీపంలో ఉన్న చెరువులో ములకల బుట్టలను నిమజ్జనం చేశారు. ఈ వేడుకల్లో ఎస్ఐ షంషుద్దీన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండె వెంకట్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జమ్మికింది బాల్ రాం గౌడ్, మాజీ ఎంపీటీసీలు గ్యార లక్ష్మణ్, నరసింహారెడ్డి, నాయకులు కల్లు సురేందర్ రెడ్డి, మహేందర్, జెసిబి వెంకట్ గౌడ్, కుకుడాల శ్రీనివాసులు, గిరిజన నాయకులు శివరాం నాయక్, గోపీనాయక్, బాలు నాయక్, సర్దార్ నాయక్, జకుడు నాయక్, హరి నాయక్, రామ్ లాల్ నాయక్, నరేష్ నాయక్, సురేష్ నాయక్, వెంకట్ రామ్ నాయక్, హనుమంతు నాయక్, మహిళలు, యువతీ యువకులు, తదితరులు పాల్గొన్నారు.
