నవతెలంగాణ – పెద్దవూర
దాతలు పాఠశాల కు విద్యా సామగ్రి పంపిణీ చేయడం అభినందనీయమని మాజీ సర్పంచ్ దండ మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పర్వేదుల గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇంద్రగంటి వెంకటయ్య సొంత ఖర్చులతో గ్రామం లోని ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కు స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిళ్ళు, నోట్ బుక్స్ లను 40 మంది పిల్లలకు పంపిణి చేసి మాట్లాడారు. రూ.20 వేల విలువైన విద్యా సామాగ్రిని స్కూల్ పిల్లలకు ఉచితంగా ఇవ్వడం ఎంతో శుభ సూచకమని అన్నారు. విద్యార్థులు దాతలు అందించిన విద్యా సామాగ్రిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంకా దాతలు పాఠశాల అభివృద్ధి లో ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరారు. పాఠశాల అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న ప్రధానో పాధ్యాయులు శైలేష్ ను,ధాత ఇంద్ర గంటివెంకటయ్యను కార్యదర్శి సాదిక్ ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులుగ్రామ పెద్దలు పాల్గొన్నారు.
దాతల సహకారం అభినందనీయం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES