– మండలంలో రెపరెపలాడిన జాతీయ జెండా
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకొని మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ గుడిమేల ప్రసాద్, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, మండల విద్యా వనరుల కేంద్రంలో మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య, కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అనిల్ రెడ్డి, అటవీ రేంజ్ కార్యాలయంలో రేంజ్ అధికారి రవీందర్ నాయక్, ఐకెపి కార్యాలయం వద్ద ఏపీఎం కిరణ్ కుమార్, రైతు వేదిక భవనం వద్ద మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద చైర్మన్ పాలెపు నర్సయ్య, బిఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయం, కమ్మర్ పల్లి సింగిల్ విండో కార్యాలయం వద్ద చైర్మన్ రేగుంట దేవేందర్, కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం వద్ద మండల అధ్యక్షులు సుంకేట రవి, భారతీయ జనతా పార్టీ మండల కార్యాలయం వద్ద అధ్యక్షులు బద్దం రమేష్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు.
మండలంలోని ఆయా గ్రామాల గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద పంచాయతీ ప్రత్యేక అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయితీ ప్రత్యేక అధికారి, ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగురవేశారు. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయా గ్రామాల్లో పాఠశాలల విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. ర్యాలీల సందర్భంగా స్వాతంత్ర సమరయోధులు, దేశ నాయకుల వేషధారణలతో ర్యాలీలో పాల్గొన్న చిన్నారులు అలరించారు. గ్రామాల్లో కుల సంఘ భవనాలు, యువజన సంఘాల కార్యాలయాల వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఈజీఎస్ ఏపీవో విద్యానంద్, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది, ఆయా గ్రామాల్లో గ్రామపంచాయతీ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES