Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బుసిరెడ్డి సేవలు అద్వితీయం..

బుసిరెడ్డి సేవలు అద్వితీయం..

- Advertisement -

పౌండేషన్ ద్వారా విద్యార్థులకు స్కూల్ కిట్స్ అందజేత
నవతెలంగాణ – పెద్దవూర
బుసిరెడ్డిపౌండే షన్ ద్వారా పాండు రంగారెడ్డి సాగర్ నియోజకవర్గానికి అందించే సేవలు అద్వితీయంగా వున్నాయి. శుక్రవారం గుర్రంపూడ్ మండలకేంద్రంలోని  మోడల్ స్కూల్ నందు 79వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్న బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగానియోజకవర్గం ప్రజలకు  స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల లో 450  మంది విద్యార్థులు స్కూల్ కిట్స్, షూలు, బెల్టులు, ఐడీ కార్డులు, బ్యాగులు ఉచితంగా పంపిణి చేశారు. కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా ప్రజలకు, పేదవారికి, విద్యార్థులకు బడుగు వర్గాలకు తమ సేవలు అందిస్తున్నారు. మానవతా విలువలతో కూడిన సేవా కార్యక్రమాలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.

బుసిరెడ్డి పౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు వెన్నుదన్ను గా నిలుస్తున్నారు. దాంతో ప్రజలు  ఆయన సేవలు అందిస్తుండటం అద్భుతం గా వున్నాయని అంటున్నారు. అనంతరం ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డిని ప్రధానోపాధ్యాయులు రాగిణి, ఉపాధ్యాయులు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి, అనుముల మాజీ వైస్ యంపిపి తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి, పిట్టల గూడెం మాజీ సర్పంచ్ రామచంద్రయ్య, ఉప సర్పంచ్ ప్రశాంత్ రెడ్డి కుంభం, కునూరి సైదిరెడ్డి, గుండెబోయిన సత్యనారాయణ, బొంగరాల నరేష్, కట్ట మనోహర్, మండలి లింగయ్య యాదవ్, కొడుమూరు వెంకటరెడ్డి, షేక్ అబ్దుల్ కరీం, అనుముల కోటేష్, షేక్ ముస్తాఫ, ఇస్రం లింగస్వామి, గజ్జల నాగార్జున రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad