లారీ, బస్సు ఢీ.. 30 మందికి గాయాలు
నవతెలంగాణ – వర్ధన్నపేట
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయపర్తి మండలం మైలారం గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు బస్సులో 60 మంది ఉన్నట్లు సమాచారం. అందులో 30 మందికి పైగా గాయాలైనట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన ముగ్గురు ముదిరాజ్ సంఘం సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. చెరువులో చేప పిల్లలు వేసేందుకు రాజమండ్రికి ఆర్టీసీ బస్సులో వెళుతుండగా ప్రమాదం జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం వరంగల్ ప్రధాన జాతీయ రహదారిపై వరంగల్ నుండి ఖమ్మం వైపు ప్రయాణికులతో వేళ్తున్న ఆర్టీసీ బస్సును వరంగల్ వైపు వెళ్తున్న లారీ బలంగా ఢీకొట్టడంతో బస్సు రోడ్డుకు అడ్డంగా తిరిగింది. దీంతో అందులోని ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు పలువురిని వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రి తరలించగా, మరికొందరిని వరంగల్ ఎంజీఎం కు తరలించారు. సమాచారం అందుకున్న రాయపర్తి, వర్ధన్నపేట పోలీసులు హుటాహుటిన క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి, లారీ డ్రైవర్, క్లీనర్ లను అదుపులోకి తీసుకున్నారు. అనంతంర కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చేపల కోసం వెళుతుండగా ముగ్గురికి గాయాలు..
వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి ముదిరాజ్ సంఘం సభ్యులు చేపల కోసం ఆర్టీసీ బస్సులు రాజమండ్రి కి వెళుతుండగా .. మైలారం గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇల్లంద గ్రామానికి చెందిన సంగినేని భీమ్ రాజ్ , మట్టపల్లి సుభాష్, సుంకరి స్వామి,లు ఉన్నారు. చెరువులో చేప పిల్లలు పోసి ఉపాధి పొందవచ్చని ముదిరాజ్ సంఘం సభ్యులు బస్సులో వెళుతుండగా.. ఈ ఘటన చోటు చేసుకున్నట్లు బాధితులు తెలిపారు. లారీలో ఇరుక్కున్న డ్రైవర్ జెసిబి సహాయంతో పోలీసులు బయటికి తీశారు.ఈ రోడ్డు ప్రమాదంతో రోడ్డుకు ఇరువైపులా రెండు కిలో మీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు క్షతగాత్రులను 108 సహాయంతో ఆస్పత్రికి తరలించారు.