నవతెలంగాణ – సదాశివ నగర్
సదాశివనగర్ మండలంలోని ఉత్తునూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే. శ్రీనివాసరెడ్డి జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులు చేసిన వివిధ సంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఇదే పాఠశాలలో చదివి బాసర త్రిబుల్ ఐటీ లో టి. శ్రీకాంక్ష్, కె. కిరణ్ సాధించారు. స్వతంత్ర దినోత్సవo సందర్భంగా వారి తల్లిదండ్రులను అభినందించారు. సొసైటీ చైర్మన్ కే. ప్రభాకర్ రావు, విజయ డైరీ చైర్మన్ దొడ్లే నరేందర్ రావు, ఆకిటి ప్రభాకర్ రెడ్డి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ నవీన్ లు త్రిబుల్ ఐటీ లో సీట్లు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు నగదును అందజేశారు. కెవికె గ్రూప్ కె.విజయ్ స్పోర్ట్స్ యూనిఫాంలను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
త్రిబుల్ ఐటీలో సీటు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు నగదు ప్రధానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES