Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ కార్యాలయంలో జెండా ఎగిరేసిన జీవన్ రెడ్డి

బీఆర్ఎస్ కార్యాలయంలో జెండా ఎగిరేసిన జీవన్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి జాతీయ పతకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలకు జీవన్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పరాయిపాలకుల చెర వీడి దేశం స్వేచ్ఛా వాయువులు పేల్చేందుకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన జిల్లాకు చెందిన పలువురు స్వాతంత్ర సమరయోధుల త్యాగ నిరతిని జీవన్ రెడ్డి కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, మాజీ జడ్పీటీసీ లు బాజిరెడ్డి జగన్, మెట్టు సంతోష్, ప్రభాకర్, వైశాలిని రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి,పూజ నరేందర్, అభిలాష్, తెలంగాణ శంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు జీవన్ రెడ్డి 79వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.

ఇదిలా వుండగా అనారోగ్యంతో బాధపడుతూ నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గొట్టుముక్కల గంగాధర్ ను జీవన్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆస్పత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad