నవతెలంగాణ-భూపాలపల్లి : నవతెలంగాణ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ముద్రించిన ప్రత్యేక సంచికను తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ బెల్లయ్య నాయక్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆవిష్కరించారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో జరిగిన 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పత్రిక యాజమాన్యానికి, విలేకరులకు, సిబ్బందికి, పాఠకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, జిల్లా అదనపు ఎస్పీ నరేష్ కుమార్, జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మాయంక్ సింగ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, నవతెలంగాణ ఉమ్మడి వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి బొక్క దయాసాగర్, భూపాలపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎర్రం సతీష్ కుమార్, ఏడివీటి డివిజన్ ఇన్చార్జి ప్రభాకర్,రిపోర్టర్లు దూలం కుమారస్వామి, చింతల కుమార్ యాదవ్, రహీం పాషా, వి సత్యనారాయణ, రాజేందర్, సాగర్, రమేష్, పుల్ల సృజన్, ఆయా శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.
నవతెలంగాణ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES