అక్టోబరు 17 నుంచి గ్రాన్మా, జువెంటుడ్ వార్తాపత్రికల 60వ వార్షికోత్సవాలు
హవానా : క్యూబా విప్లవ కమాండర్ ఇన్ చీఫ్ ఫైడల్ కాస్ట్రో రజ్ ప్రారంభించిన గ్రాన్మా, జువెంటుడ్ రెబెల్డ్ వార్తాపత్రిక 60వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని అక్టోబరు 17 నుంచి 20వరకు హవానాలో అంతర్జాతీయ ఫెస్టివల్ జరుగనున్నది. క్యూబా కమ్యూనిస్టు పార్టీ (పీసీసీ), యంగ్ కమ్యూనిస్టు లీగ్‌లు ఈ విషయాన్ని గురువారం ప్రకటించాయి.క్యూబా కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రికగా గ్రాన్మా, క్యూబా యువత వాణిని వినిపించే పత్రికగా జువెంటుడ్ రెబెల్డ్ పత్రికలు వున్నాయి. గత 60ఏండ్లుగా ఈ రెండు పత్రికలు వాస్తవాలకు, నిజాన్ని చెప్పడానికి కట్టుబడి వున్నాయి. ఐక్యతను, సంఘీభావాన్ని పెంచి పోషిస్తూ, కాస్ట్రో ప్రారంభించిన సోషలిస్టు ప్రాజెక్టు సృజనాత్మక నిర్మాణంలో ఇతోధికంగా సేవలందిస్తూ వస్తున్నాయి. రాజకీయ, విద్యా, సాంస్కృతిక సంబంధమైన అంశాలతో సహా మొత్తంగా కిందిస్థాయిలో పరస్పర మార్పిడికి ఈ ఉత్సవాలు క్రియాశీలమైన వేదికగా పనిచేస్తాయి. అలాగే విమర్శనాత్మకమైన ఆలోచనల్లో పాతుకుపోయిన చర్చలు, సహకారం, సంఘీభావాలను పెంపొందించడానికి ఈ ఉత్సవాలు శక్తివంతమైన వేదికగా పనిచేస్తుంది. నేటి అంతర్జాతీయ పరిస్థితుల్లో శాంతి, సామాజిక న్యాయాలకు ఎదురవుతున్న పలు సవాళ్ళను అందరం కలిసి పరిష్కరించాల్సి వుంది. ఈ ప్రజా ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా కమ్యూనిస్టు,వామపక్ష భావజాల సంస్థలు, ప్రగతిశీల,యువజన పార్టీలు, సంఘాలు, సామాజిక ఉద్యమాలు,మీడియా సంస్థలు, విద్యా, సాంస్కృతిక సంస్థలను క్యూబా కమ్యూనిస్టు పార్టీ, యంగ్ కమ్యూనిస్టు లీగ్‌లు ఆహ్వానించాయి. విద్వేషాన్ని రగిల్చేందుకు ఉద్దేశించిన సామ్రాజ్యవాద ఎత్తుగడలను, మీడియా అవకతవకలను, మన దేశం గురించి వాస్తవాలను వక్రీకరించడం, ఫాసిజం, నయా వలసవాదాలను పెంచి పోషించేలా వ్యాఖ్యలు చేయడాన్ని ఎదుర్కొనాలంటే మనందరం కలిసి కట్టుగా వుండాలని ఆ పార్టీలు పేర్కొన్నాయి.క్యూబా సాంస్కృతిక దినోత్సవమైన అక్టోబరు 20న ఈ ఉత్సవాలు ముగుస్తాయి.
విప్లవ వాణికి 60ఏండ్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES