Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంరాష్ట్రాల హక్కుల్ని హరిస్తోంది

రాష్ట్రాల హక్కుల్ని హరిస్తోంది

- Advertisement -

స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో కేంద్రంపై స్టాలిన్‌ ధ్వజం
చెన్నై :
రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కేంద్రం హరిస్తోందని తమిళ నాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ధ్వజమెత్తారు. ఆరోగ్యం, విద్య వంటి కీలక రంగాలను ప్రస్తావిస్తూ రాష్ట్రాల హక్కులను హరించడానికి కేంద్రం స్థిరంగా ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్టాలిన్‌ ప్రసంగిస్తూ ‘రాష్ట్రాలకు న్యాయబద్ధంగా దక్కాల్సిన నిధులను కేటాయించడంలో కేంద్రం వివక్ష చూపుతోంది. న్యాయస్థానాలను ఆశ్రయించడం ద్వారా మాత్రమే తమిళనాడు తన వాటాను పొందగలదు’ అని చెప్పారు. నిధులలో న్యాయబద్ధంగా రావాల్సిన వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వాలు వాదించాల్సి వస్తోందని, నిరసన తెలపాల్సి వస్తోందని, పిటిషన్లు దాఖలు చేయాల్సి వస్తోందని, ఇలాంటి పరిస్థితులలో తాము ఉన్నామని తెలిపారు. ఇది సమాఖ్య వ్యవస్థకు మంచిది కాదని అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాల స్వతంత్రతను గౌరవించడం అవసరమని స్టాలిన్‌ నొక్కి చెప్పారు. ప్రతి రాష్ట్రానికీ విధిగా స్వతంత్ర గుర్తింపు ఉండాలని, అప్పుడే భారత్‌ అభివృద్ధి చెంది అంతర్జాతీయ వేదికపై రాణిస్తుందని అన్నారు. కాగా ‘ఎక్కడైతే ప్రజాస్వామ్యాన్ని దొంగిలిం చలేమో, ఎక్కడైతే ప్రతి పౌరుడి ఓటును లెక్కిస్తారో, ఎక్కడైతే భిన్నత్వం మన బలంగా పరిఢవిల్లుతుందో అలాంటి దేశాన్ని నిర్మించడానికి మనం దీక్ష వహిం చాలి’ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్టాలిన్‌ పోస్ట్‌ చేశారు. నిజమైన స్వేచ్ఛ అంటే మతోన్మాదాన్ని తిరస్కరించడం, వివక్షను నిర్మూలించడం, అణ గారిన వర్గాలను రక్షించడం అని ఆయన తెలిపారు. అప్పుడే మన స్వాతంత్య్ర సమర యోధుల ఆలోచనలను గౌరవించినట్లు అవుతుందని అన్నారు. ప్రతి వ్యక్తి సమా నత్వంతో, హుందాగా, గౌరవంగా జీవించగలగాలని స్టాలిన్‌ ఆకాంక్షించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad