Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయందేశ ద్రోహుల్ని స్మరిస్తారా?

దేశ ద్రోహుల్ని స్మరిస్తారా?

- Advertisement -

– ఇది త్యాగధనులను అవమానించడమే: సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య
– జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ త్యాగశీలులను విస్మరించి దేశద్రోహులను పొడగటం అన్యాయ మని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య అన్నారు. శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీకి దేశ స్వాతంత్య్రా నికి సంబంధంలేదనీ, అలాంటి వ్యక్తిని మోడీ ఎలా పొగుడుతారని ప్రశ్నించారు. శుక్రవారం హైదరా బాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయం వద్ద 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వ హించారు. జాతీయ జెండాను ఆ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ఆవిష్కరించారు. అనంతరం ఎస్‌.వీరయ్య మాట్లా డుతూ.. దేశ స్వాతంత్య్రోద్య మానికి నాయకత్వం వహించిన మహాత్మాగాంధీ, సుభాష్‌ చంద్రబోస్‌, భగత్‌సింగ్‌, అంబేద్కర్‌ లాంటి మహనీయుల గురించి గానీ, వారి త్యాగాల గురించి గానీ ప్రధాని ఎక్కడా ప్రస్తావించలేదని విమర్శిం చారు. శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ ప్రస్తావన ముందుకు తీసుకొచ్చి స్వాతంత్య్రోద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్రిటీష్‌వారితో జరిగిన సాత్వంత్య్రపోరాటానికి శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ ఏనాడూ మద్దతివ్వలేదనీ, స్వాతంత్య్రం అనంతరం ఆర్‌ఎస్‌ఎస్‌ కోరిక మేరకు జనసంఫ్‌ును ప్రారంభించారని తెలిపారు. తెల్ల దొరలకు సేవచేసిన సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ అని విమ ర్శించారు. తాను జైలులో ఉండటం కంటే బయట ఉంటేనే మీకు ఎక్కువ ఉపయోగమని బ్రిటీషర్లతో బేరసారాలాడి జైలు నుంచి బయటకు వచ్చి ద్రోహి సావర్కర్‌ అన్నారు. భారత ప్రభుత్వం సామ్రాజ్యవా దులకు తలొగ్గి అమెరికాకు జూనియర్‌ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. దేశ సార్వభౌమ త్వానికి ప్రమాదం ముంచుకొస్తున్న నేపథ్యంలో కార్మికులు, కర్షకులు, ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర సీనియర్‌ నాయకులు పి. రాజారావు, కోశాధి కారి వంగూరు రాములు, ఉపాధ్యక్షులు వీఎస్‌. రావు, రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేష్‌. ఎం. పద్మశ్రీ, పి. శ్రీకాంత్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ. సునీత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad