Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంరాజ్‌ భవన్‌లో ఎట్‌ హౌం

రాజ్‌ భవన్‌లో ఎట్‌ హౌం

- Advertisement -

– ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ ఏర్పాటు చేసిన ఎట్‌ హౌం కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రేవంత్‌ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీకి నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు ఎన్‌.రామచందర్‌రావుతో పాటు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, టీజేఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం తదితరులు హాజరయ్యారు. బీఆర్‌ఎస్‌కు చెందిన నాయకులు ఎట్‌ హౌంకు హాజరు కాలేదు. అయితే బీఆర్‌ఎస్‌ మహిళా నాయకురాలు తుల ఉమ ఎట్‌ హౌంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మంత్రులను పేరు పేరునా గవర్నర్‌కు పరిచయం చేశారు. కార్యక్రమంలో రాంచందర్‌ రావును సీఎం రేవంత్‌ రెడ్డి పలుకరించారు. అదే రకంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఉన్నతాధికారులకు గవర్నర్‌తో కలిసి ప్రత్యేకంగా అభివాదం చేశారు.
గవర్నర్‌తో సీఎం భేటీ
ఎట్‌ హౌం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డి గవర్నర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ సమావేశాలు, పంచాయతీ ఎన్నికల విషయాలను ప్రస్తావించినట్టు తెలుస్తున్నది. బీసీ బిల్లుల గురించి ఆయన గవర్నర్‌ దగ్గర ఆరా తీసినట్టు సమాచారం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad