డిప్యూటీ సీఎం మల్లు భట్టి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
నవతెలంగాణ-విలేకరులు
ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని, ప్రజాపాలనలో అన్ని వర్గాలూ పురోగతి సాధిస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం రైతు పక్షపాతిగా వ్యవహరిస్తోందన్నారు. ఖమ్మం నగరంలోని స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పాల్గొని పోలీసు గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. వికారాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన వేడుకలకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ హాజరై జాతీయ జెండా ఎగురవేశారు. అంతకుముందు పోలీసులు నుంచి గౌరవ వందనం స్వీకరించారు. భువనగిరి జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని తెలంగాణ శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆవిష్కరించారు.
ప్రజాపాలనలో అన్ని వర్గాల్లో పురోగతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES