పామాయిల్ వంద్యత్వ మొక్కలు పై వినతి…
నవతెలంగాణ – అశ్వారావుపేట
పామాయిల్ సాగు దారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పై పార్లమెంట్ ఉభయసభల సీపీఐ(ఎం) ఫ్లోర్ లీడర్ జాన్ బిట్రాస్ కు ఆయిల్ ఫాం గ్రోయర్స్ సొసైటీ నాయకులు తుంబూరు మహేశ్వర రెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్య లు శనివారం వినతి పత్రం అందించారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ఆయన భద్రాచలం వెళ్తూ రైతుల విజ్ఞప్తి మేరకు అశ్వారావుపేట లో కొద్ది సమయం గడిపారు.
ఆయనకు చుండూరు మహేశ్వర రెడ్డి వంద్యత్వ మొక్కల తో రైతులు నష్టపోయారని,రైతుల పట్ల ఆయిల్ ఫెడ్ వివక్ష చూపుతుందని,ఈ ప్రాంతంలో నిర్మించాల్సిన పరిశ్రమలను సాగు లేని ప్రాంతాల్లో నిర్మిస్తున్నారని ఆంగ్లంలో వివరించారు. దీంతో సానుకూలంగా స్పందించిన ఆయన ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావిస్తాను అని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు చిరంజీవి,రైతు సంఘం నాయకులు దొడ్డా లక్ష్మినారాయణ,మోరంపుడి శ్రీనివాసరావు,రైతులు చక్రధర్ రెడ్డి,కలపాల భద్రం,నారం అప్పారావు,శోభన్ బాబు,గడ్డం వెంకటేశ్వరరావు లు పాల్గొన్నారు.