Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్యువత సంకృతి, సంప్రదాయాలపై దృష్టి సారించాలి..

యువత సంకృతి, సంప్రదాయాలపై దృష్టి సారించాలి..

- Advertisement -

కొయ్యుర్ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
నవతెలంగాణ – మల్హర్  రావు

శ్రీ కృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని మండలంలోని కొయ్యుర్ సెంటర్ అఖిల భారత యాదవ మహాసభ సంఘం ఆధ్వర్యంలో శ్రీష్ణాష్ణమీ వేడుకలు శనివారం అంగరంగవైభవంగా నిర్వహించారు. ముందుగా కృష్ణం వందే జగద్గురు అంటూ శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు దక్షిణాది భారతదేశంలో అత్యంత భారీగా ఈ వేడుకలు నిర్వహించినట్లుగా తెలిపారు.యాదవులు కులదైవం శ్రీకృష్ణుడు బలరాముడని తెలిపారు.ప్రస్తుతం సైన్స్ టెక్నాలజీ మీదనే విద్యార్థులు, యువకులు దృష్టి సారిస్తున్నారన్నారు.

అందుకే భావితరాలకు సంకృతి, సంప్రదాయలు,చరిత్ర తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.ఈ నేపథ్యంలోనే శ్రీకృష్ణుడు జన్మాష్టమి వేడుకలు నిర్వహించి ఉట్టికొట్టే కార్యక్రమాలు నిర్వహించ్చినట్లుగా చెప్పారు.ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షుడు కాసాని శ్రీషేలం,మాజీ అధ్యక్షుడు యాదండ్ల రామన్న యాదవ్,డివిజన్ నాయకుడు కోడారి చిన మల్లయ్య యాదవ్,కొయ్యుర్ గ్రామ మాజీ సర్పంచ్ సిద్ధి లింగమూర్తి యాదవ్, మాజీ జెడ్పిటిసి కొండ రాజమ్మ తోపాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad